ఏపీలో ఆపిల్ ప‌రిశ్ర‌మ‌.. 50 వేల మందికి ఉపాధి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే బారీ ప‌రిశ్ర‌మ‌లు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంకేతంగా ఇప్ప‌టికే ఆపిల్ ప‌రిశ్ర‌మ త‌మ త‌యారీ యూనిట్‌ను రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

క‌డ‌ప జిల్లాలో రాబోతున్న ఆపిల్ త‌యారీ యూనిట్ ప‌రిశ్ర‌మ వ‌ల్ల దాదాపు 50 వేల మందికి ఉపాధి ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. ఏపీలో ఆపిల్ ప‌రిశ్ర‌మ నెల‌కొల్పేందుకు ఇప్ప‌టికే అన్ని ర‌కాలా ఫార్మాలిటీస్ పూర్తైన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఏపీ స‌ర్కార్ సైలెంట్‌గా ప‌ని పూర్తి చేసింద‌ని స‌మాచారం. క‌డ‌ప జిల్లా కోప్పర్తి పారిశ్రామిక ఏరియాలో ఆపిల్ యూనిట్ నెల‌కొల్పేందుకు రెడీ అయ్యింద‌ని టాక్‌.

ఇదే క‌నుక జ‌రిగితే ఏపీలో 50వేల ఉద్యోగాలు ప‌క్కాగా వ‌స్తాయ‌ని పారిశ్రామిక వేత్త‌లు అంటున్నారు. ఆపిల్ యూనిట్ ఏర్పాటు చేస్తే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ప‌రిశ్ర‌మ‌లు మ‌రిన్ని కంపెనీలు కూడా ఏపీవైపు మొగ్గుచూపుతాయ‌ని చెబుతున్నారు. ఇక ఇదే విష‌యంపై ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ ఆపిల్ ప‌రిశ్రమ యూనిట్ నెల‌కొల్పేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here