దేశంలో ఏపీ ఫ‌స్ట్‌.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలే కార‌ణ‌మా..

దేశంలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో ఏపీ మంచి ఫ‌లితాలు సాధిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌రకు ఎక్క‌డా లేని విధంగా ఏపీలో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు. దీంతో కేసుల తీవ్ర‌త తెలియడంతో పాటు వైద్య సేవ‌లు కూడా అంది ప్ర‌జ‌లు క‌రోనాను జ‌యించేస్తున్నారు.

దేశంలో క‌రోనా కేసుల తీవ్ర‌త‌ను తగ్గించ‌డంతో పాటు టెస్టులు చేయ‌డంలో ఇండియాలోనే ఏపీ పేరు సంపాదించుకుంది. ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,53,385గా ఉంటే క‌రోనాను జ‌యించి కోలుకున్న వారి సంఖ్య 5,79,474 గా ఉంది. దీన్ని బట్టి ఎంత‌మంది కోలుకుంటున్నారో అర్థ‌మ‌వుతుంది. గురువారం లెక్క‌ల ప్ర‌కారం 7,855 మందికి పాజిటివ్‌గా రాగా.. 8,807 మంది కోలుకున్నారు. కొత్త కేసుల సంఖ్య కంటే డిశ్చార్జు అవుతున్న వారి సంఖ్యే అధికంగా ఉంది.

ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం సీఎం వై.ఎస్ జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు. క‌రోనా ప‌ట్ల ఆయ‌న సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని చోట్లా క‌రోనాకు మంచి వైద్యం అందించాల‌ని ఆయ‌న ఆదేశించారు. రోగుల ప‌ట్ల మాన‌వ‌త్వంతో మెల‌గాల‌ని చెప్పారు. ఏ క్ష‌ణం కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసినా స్పందించి స‌మాచారం ఇచ్చి ఆదుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పూర్తి స్థాయిలో సూచ‌న‌లు చేశారు.

అందుకే ఏపీలో క‌రోనా టెస్టులు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌టంతో పాటు కోలుకోవ‌డం కూడా తొంద‌ర‌గానే జ‌రుగుతోంది. క‌రోనా విజృంభిస్తున్న మొద‌ట్లో టెస్టుల సామర్థ్యం చాలా త‌క్కువ‌గా ఉండేది. ఇప్పుడు దేశంలో చేస్తున్న 100 టెస్టుల్లో 8 టెస్టులు ఏపీ నుంచే జ‌రుగుతున్నాయంటే ఎంత పురోగ‌తి సాధించామో తెలుసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here