ఏపీ రూ. 19 వేల కోట్లు, తెలంగాణ రూ.12,461 కోట్లు..

కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాలు గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ స్తంభించిపోవ‌డంతో కాలం గ‌డిపేందుకు ఆర్బీఐ వ‌ద్ద‌కు వెళ్లా్ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాల ప‌రిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం..

రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబ‌రు నెల‌లో విడుద‌ల చేసిన బులిటెన్‌లో బ్యాంకు వివ‌రాలు బ‌య‌టుయ వ‌చ్చాయి. ఇందులో ఆంధ్ర‌పదేశ్ జులై నెల‌లో 26 రోజులు, తెలంగాణ 29 రోజులు ఆర్‌.బీ.ఐ వ‌ద్ద‌కు చేబ‌దుళ్ల కోసం ఎళ్లాయ‌ని వివ‌రాలు ఉన్నాయి. ఇక జ‌మ్ముక‌శ్మీర్ 29 రోజులు, నాగాలాండ్ 27 రోజులు ఆర్‌.బీ.ఐ వ‌ద్ద‌కు వెళ్లాయి. దేశ వ్యాప్తంగా ఈ రాష్ట్రాలు త‌ప్ప ఏ రాష్ట్రం కూడా ఆర్బీఐ వ‌ద్ద‌కు చేబ‌దుళ్ల కోసం వెళ్ల‌లేదు.

ఇక వేస్ అండ్ మీన్స్ కోసం ఏపీ రూ. 1359 కోట్లు, తెలంగాణ రూ. 1278 కోట్లు తీసుకున్నట్లు బులిటెన్‌లో తెలిసింది. స్పెష‌ల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 31 రోజులు ఏపీ రూ. 1163 కోట్లు, తెలంగాణ రూ. 1344 కోట్లు తీసుకున్నాయి. ఇవే కాకుండా ఓవ‌ర్ డ్రాఫ్ట్ కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రోజులు రూ. 233 కోట్లు, తెలంగాణ ప‌ది రోజులు రూ. 286 కోట్ల‌ను తీసుకుంది. దేశంలో అభివృద్ధి ప‌రంగా పేరొందిన ఏ రాష్ట్రాలు వీటిని తీసుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌తో పాటు చిన్న ఈశాన్య రాష్ట్రాలు మాత్ర‌మే ఆర్థిక అవ‌సరాలు తీర్చుకోవ‌డానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.

ఇక జూన్‌లో కూడా ఏపీ 17 రోజులు, తెలంగాణ 7 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్‌కి వెళ్లాయి. ఇక ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నాలుగు నెలల్లో ఏపీ 19 వేల కోట్లు, తెలంగాణ రూ. 12,461 కోట్లు రుణాన్ని బ‌హిరంగ మార్కెట్ ద్వారా తీసుకున్న‌ట్లు ఆర్‌.బీ.ఐ బులిటెన్ ప్ర‌కారం తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here