ఢిల్లీ బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌.. డీటెయిల్స్ ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. ప్ర‌ధాన్య‌త సంత‌రించుకున్న అపెక్స్ కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొనేందుకు ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో సాగునీటికి సంబంధించిన కీల‌క విష‌యాలు చ‌ర్చించ‌నున్నారు. ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో కూడా జ‌గ‌న్ భేటి ఉంది.

ఇటీవ‌ల జ‌గ‌న్‌ వ‌రుస ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌తో రాజ‌కీయాలు వేడెక్కాయి. ప్ర‌తిప‌క్షాలు ఢిల్లీ టూర్ గురించి కాస్త నెగిటివ్‌గానే ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ అక్క‌డంతా పాజిటివ్‌గానే జ‌రుగుతోంద‌ని సంకేతాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. నేటి ఢిల్లీ టూర్లో సీఎం జ‌గ‌న్ రేపు ప్ర‌ధానితో భేటి అవుతారు. ఆ త‌ర్వాత‌నే అపెక్స్ కౌన్సిల్ స‌మావేశంలో ప‌ల్గొంటారు. ఈ స‌మావేశంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఇప్ప‌టికే జ‌గ‌న్ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు కూడా ఇచ్చారు. కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రితో పాటు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భేటిలో పాల్గొంటారు.

ఈ స‌మావేశంలో ఏపీ వాద‌న‌ను జ‌గ‌న్ క్లియ‌ర్‌గా వినిపించ‌నున్నారు. ప్ర‌ధానంగా కృష్ణా జలాల విష‌యంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న వివాదానికి ఈ స‌మావేశంలో తెర‌ప‌డిదే బాగుంటుంద‌ని అంతా అనుకుంటున్నారు. కాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌రిగే స‌మావేశంపైనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రెండు సార్లు భేటీ అవ్వ‌డం జ‌రిగింది. తాజాగా ఇప్పుడు మ‌రోసారి ఏకంగా ప్ర‌ధానితో స‌మావేశం అవ్వనున్నారు. మొత్తం మీద 24 గంట‌లు గ‌డిస్తే కానీ జ‌గ‌న్ టూర్‌పై ఫుల్ క్లారిటీ రాదు. ఈలోపే ఏపీ రాజ‌కీయాల్లో దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here