కాజల్ జతగాడు అతగాడేనా..?

నటి కాజల్ అగర్వాల్ వివాహానికి సంబంధించి ఇప్పటివరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో కాజల్ నిశ్చితార్థం కూడా చేసుకుందని మీడియా కోడై కూసింది.. కానీ ఈ వార్తలపై ఒక్కసారి కూడా అధికారికంగా స్పందించలేదీ చందమామ. తన పని తాను చేసుకుంటూ వరుస సినిమాల్లో నటించింది కాజల్.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కాజల్ వివాహానికి సంబంధించి ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఈసారి ఏకంగా వరుడి పేరు కూడా బయటికి రావడం విశేషం. కాజల్ మనసు దోచిన ఆ వరుడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ గౌతం కిచ్లుని కాజల్ వివాహం చేసుకోనుందని సమాచారం. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయిందని.. ముంబైలో వీరి వివాహం జరగనుందని  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం… కమల్ హాసన్, చిరంజీవిల సరసన నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here