టిడిపిలో ఆందోళ‌న‌.. చంద్ర‌బాబుతోనే మొద‌లు

ఏపీలో రాజ‌కీయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌రం ముగిసిపోయిందంటూ పొలిటిక‌ల్ సెటైర్లు ఎక్కువ‌వుతున్నాయి. దీనికితోడు పార్టీలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితులు కూడా మ‌రింత హీట్‌ను పెంచుతున్నాయి.

జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన కొత్త‌లో తెలుగుదేశం పార్టీ అంత డీలా ప‌డ‌లేదు. జ‌గ‌న్ ప‌రిపాల‌న చూసి స్పందిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పిన తీరు చూస్తే ఎవ్వ‌రికైనా ప్ర‌తిప‌క్ష పార్టీ త‌న పాత్ర ఘ‌నంగా పోషిస్తుంద‌ని అనుకున్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం త‌న మార్క్ పాల‌న‌తో ముందుకు వెళుతున్నారు. అన్ని వర్గాల ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందజేస్తూ ప‌రిపాలిస్తున్నారు.

ఇక ఇదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి రావ‌డం కూడా చంద్ర‌బాబుకు మైన‌స్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌త్య‌క్ష్య ఆందోళ‌న‌ల‌కు దిగాలంటే కూడా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో చంద్ర‌బాబు కొన్ని నెల‌ల నుంచి కేవలం జూమ్ వీడియోల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు బెయిల్‌పై విడుద‌లైన నేత‌ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి బాబు బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఇదే స‌మ‌యంలో రాష్ట్ర పార్టీ అద్య‌క్షుడిగా అచ్చెన్నాయుడు దాదాపుగా ఖ‌రారైన‌ట్లేన‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో స్వ‌యాన‌ ఆయ‌న అన్న కుమారుడు ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడే అసంతృప్తితో ఉన్నార‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంపై అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధ‌మవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక చంద్ర‌బాబు మాత్రం గ‌ట్టి వాయిస్ ఉండి జ‌గ‌న్ ఎదుర్కొనే స‌త్తా అచ్చెన్నాయుడుకు మాత్ర‌మే ఉంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి రాష్ట్రమంతా నాయ‌కులు ఉన్నారు. అయితే ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ఓట‌మి అనంత‌రం చోటుచేసుకున్న ప‌రిణామాల వ‌ల్ల పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో అచ్చెన్నాయుడు లాంటి వాయిస్ ఉన్న నాయ‌కులైతేనే బాగుంటుంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌గా.. యువ నాయ‌క‌త్వంవైపు మొగ్గు చూపాల‌ని ప‌లువురు కోరుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఎలా ముందుకెళ‌తారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here