కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క..

‘సూపర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి అనుష్క. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది ‘అరుంధతి’తో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తానే కేరాఫ్ అడ్రస్ అని చాటి చెప్పింది స్వీటీ. ఇక ‘బాహుబలి’ తర్వాత సినిమాల్లో వేగం తగ్గించిన ఈ ముద్దుగుమ్మ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది.

ఇదిలా ఉంటే అనుష్క తాజాగా నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం అనుష్క ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మరి ఈ చిత్రాన్ని ఒక్క తమిళంలోనే విడుదల చేస్తారా?  తెలుగులోనూ చేస్తారా..?  అన్నదానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here