అను హాట్‌నెస్‌ పెంచేసిందే..!

ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది నటి అనుపమ పరమేశ్వరన్. తన క్యూట్ నటన, ట్రెడిషనల్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిన్నది గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. కెరీర్ తొలినాళ్ల నుంచి ఎక్సపోజింగ్ కు దూరంగా ఉంటుందీ చిన్నది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నది అక్కడ కూడా ఎప్పుడు హద్దులు దాటలేదు.

అయితే తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోను చూస్తుంటే..  అను హాట్ నెస్ పెంచేసిందా..? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. తెలుపు రంగు డ్రస్ లో వీపు అందాలను చూపిస్తూ దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. చేతులు, కాళ్లు కనిపించేలా స్కిన్ షో చేసిన అను ఆ ఫోటోకి.. `నా చేతులు కాళ్ళు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తే … దయచేసి సోదర సోదరీమణులారా నాకు దూరంగా ఉండండి“ అంటూ క్యాప్షన్ జోడించి ట్రోలర్లకు ముందే సున్నితంగా హెచ్చరించిందన్నమాట. ఈ ఫొటోతో తాను కూడా గ్లామర్ షోకి సిద్ధమే అని అను.. చెప్పకనే చెప్తోందా అని భావిస్తున్నారు.

https://www.instagram.com/p/CGudub3JVCJ/?utm_source=ig_web_copy_link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here