ఆయన వ్యక్తిత్వమే ప్రత్యేకం – అనూ ఇమాన్యేల్

పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా నిర్మితమైన ‘అజ్ఞాతవాసి’ ఈ నెల 10వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. తాజాగా ఈ సినిమాను గురించి .. పవన్ కల్యాణ్ గురించి అనూ ఇమ్మాన్యుయేల్ మాట్లాడింది. పవన్ కల్యాణ్ గురించి అంతకు ముందు తాను విన్నాననీ, ఈ సినిమాతో ఆయనని దగ్గరగా పరిశీలించే అవకాశం దొరికిందని చెప్పింది.
 ఆయన వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనదనీ, ఎంతో స్టార్ డమ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారని అంది. ఆయనకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువనీ, ఆయనతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇంతవరకూ అనూ ఇమ్మాన్యుయేల్ చేసినవాటిలో ఇదే పెద్ద సినిమానని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే ఆమె స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here