కడప నుంచి పారిపోయా

‘శివ’ సినిమాలో హీరోకి స్నేహితులుగా నటించిన చిన్నా .. రామ్ జగన్ లతో, తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమం జరిగింది. ఈ షోకి హాజరైన అలీ .. చిన్నా పాతిక సంవత్సరాల క్రితం కడపలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
 ఆ సంఘటనను గురించి రామ్ జగన్ దగ్గర అలీ ప్రస్తావిస్తూ .. “నేను .. చిన్నా కడప వెళ్లాం .. ‘శివ’ సినిమాలో ఎంత పెద్ద గొడవ అయిందో .. కడపలో అంత పెద్ద గొడవ అయింది. నేను … చిన్నా .. బాలాజీ .. ఇంకో ఇద్దరం ఒక రూమ్ లో వున్నాం. సోము అని ఇంకో కేండేట్ వున్నాడు .. తను అక్కడివాడిని ఏదో అన్నాడు. అంతే .. వాళ్ల వర్గం మొత్తం వచ్చేసింది. ‘బయటికి రండిరా .. ‘ అంటూ వాళ్లు అరవడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల వున్నవాళ్లు అది షూటింగ్ అనుకుంటున్నారు. మేం వున్నది ముగ్గురం .. వచ్చింది వందమంది. అంతే, అక్కడి నుంచి అందరం పారిపోయాం” అంటూ నవ్వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here