భాగమతి గురించి ప్రభాస్ కామెంట్

బాహుబ‌లి ప్ర‌భాస్‌, త‌న స్నేహితురాలు అనుష్క న‌టించిన ‘భాగ‌మ‌తి’ చిత్ర ట్రైల‌ర్ గురించి ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పందించారు. ట్రైల‌ర్ బాగుంద‌ని వెల్ల‌డించ‌డంతో పాటు స్వీటీని పొగిడాడు. అనుష్క‌కి క‌ష్ట‌ప‌డేత‌త్వం, అంకిత‌భావం ఉన్నాయ‌ని ప్ర‌భాస్ పేర్కొన్నాడు. సినిమాలో అనుష్క న‌ట‌న బాగుంద‌ని, ద‌ర్శ‌కుడు అశోక్‌కి, చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
‘భాగ‌మ‌తి’ చిత్ర ట్రైల‌ర్ సోమవారం విడుదలైంది. విడుదలైన మూడు గంటల్లోనే 20 లక్షలకుపైగా వీక్ష‌ణ‌లు వచ్చాయి. గ‌తంలో ‘భాగ‌మ‌తి’ టీజర్‌ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్‌.. అనుష్కపై ప్రశంసలు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here