అజ్ఞాత వాసి టైం కి కళ్యాణ్ రామ్ వస్తాడు

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం, పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విశ్రాంతి సమయంలో ‘ఎమ్మెల్యే’ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారనేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి’) సినిమా రూపొందుతోంది.
 విశ్వప్రసాద్ – భరత్ చౌదరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ నటిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ ను, ‘అజ్ఞాతవాసి’ థియేటర్స్ లో ప్రదర్శితమయ్యేలా సెట్ చేశారు. ఈ విధంగా చేయడం వలన మరింత మందికి ‘ఎమ్మెల్యే’ రీచ్ అవుతుందని భావిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలోనే తెలియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here