పీ ఫైజర్ క‌రోనా వ్యాక్సిన్‌ను ఓకే చేసిన మ‌రో దేశం..

ప్ర‌పంచ దేశాలు క‌రోనా ధాటికి బెంబేలెత్తిపోతున్నాయి. క‌రోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా ఆస‌క్తి చూపుతున్నాయి. దీంతో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోనికి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జ‌ల‌కు అంద‌జేయాల‌ని ఆలోచిస్తున్నాయి. ఇప్ప‌టికే ర‌ష్యాలో స్నుతిక్ వి వ్యాక్సిన్ ఎంతో మందికి పంపిణీ చేశారు. ఇప్పుడు పీ ఫైజ‌ర్ త‌యారుచేస్తున్న వ్యాక్సిన్‌ను కూడా అంద‌రూ ఆమోదం తెలుపుతున్నారు.

అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ పీ ఫైజర్ వినియోగానికి బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయంలో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు బహ్రెయిన్ జాతీయ ఆరోగ్య శాఖ ఆమెదం తెలిపింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో శుక్రవారం కథనాలు వచ్చాయి. పీఫైజర్ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పూర్తిగా పరీశీలించి, సమీక్షించిన తరువాతనే ఆమోదం తెలిపినట్లు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికాలోని పీ ఫైజర్ సంస్థతో పాటు జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థ కూడా పాల్గొంది.

ఇదిలా ఉంటే పీఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లాండ్ కూడా ఆమెదం తెలిపింది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ఆమెందించిన రెండో దేశంగా బహ్రెయిన్ నిలిచింది. పీ ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే.. గత నెల చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ వినియోగానికి కూడా బహ్రెయిన్ ఆమెదం తెలిపింది. చైనాకు చెందిన సినోఫార్మ్ తయారు చేసిన ఆ వ్యాక్సిన్‌ను దాదాపు 6000 మందికి అందజేశారు కూడా. ఇక భార‌త్ కూడా క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. భార‌త్ బ‌యోటెక్ ఆద్వ‌ర్యంలో ఇప్ప‌టికే కోవాగ్జిన్‌ను త‌యారుచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ఓ క్లారిటీతో ఇండియా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here