క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి..

క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. ఇండియాలో అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొనేందుకు ఓ మంత్రి ముందుకు వ‌చ్చారు. మూడో ద‌శ కోవాగ్జిన్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొంటాన‌ని ఇప్ప‌టికే అధికారుల‌తో క‌లిసి మాట్లాడారు.

మమతా బెనర్జీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న 62 ఏళ్ల హకీం ఇప్పటికే ఎన్ఐసీఈడీ అధికారులతో మాట్లాడారు. కరోనా వ్యాక్సీన్ పరిశోధనల్లో భాగంగా కోల్‌కతాలోని ఎన్ఐసీఈడీలో నిర్వహించనున్న కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కోసం వాలంటీర్‌గా ఉండేందుకు పశ్చిమ బెంగాల్ మంత్రి పిర్హద్ హకీమ్ ముందుకొచ్చారు. కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు అధికారులకు చెప్పారు. తాను ప్రజలకు తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నానని ఆయ‌న తెలిపారు. తాను చేసే ఈ ప‌ని వ‌ల్ల ప్ర‌జ‌ల చికిత్స‌కు మేలు జ‌రుగుతుందంటే అంత‌కు మించిన సంతోష‌మే లేద‌న్నారు.

కాగా త్వరలో ఎన్ఐసీఈడీలో జరిగే కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్‌ కోసం కనీసం వెయ్యి మంది వాలంటీర్లు అవసరం అవుతారని అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే అధికారులకు తన సమ్మతిని తెలియజేశాననీ.. తాను కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్‌కు ఫిట్ అవుతానో లేదో తెలుసుకునేందుకు అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు. కొవాగ్జిన్ ట్రయల్స్ కోసం హకీం స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ (ఎన్ఐసీఈడీ) అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here