కోపంగా మాట్లాడిన అమితాబ్‌.. అపార్థం చేసుకున్న మ‌హిళ‌

బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఇటీవ‌ల ఆయ‌న క‌రోనా నుంచి కోలుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న హాస్పిట‌ల్‌లో సేవ‌ల గురించి మాట్లాడటంతో కొంద‌రి నుంచి నెగ‌టివ్ రెస్సాన్స్ వ‌స్తోంది.

ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్ లో క‌రోనా చికిత్స తీసుకొని కోలుకున్న అనంత‌రం అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంటికి వెళ్లారు. హాస్పిట‌ల్‌ను, త‌న‌కు సేవ‌లందించిన డాక్ట‌ర్ల‌ను, న‌ర్సులు చేసిన సేవ‌ల‌ను ఆయ‌న కొనియాడుతూ ఓ పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన ఓమ‌హిళ హాస్పిట‌ల్‌లో త‌న తండ్రికి క‌రోనా లేక‌పోయినా చేర్చుకున్నార‌న్నారు. వేరే హాస్పిట‌ల్‌లో టెస్టు చేపిస్తే నెగిటివ్ వ‌చ్చింద‌న్నారు.

ఇలాంటి హాస్పిట‌ల్ గురించి బిగ్‌బీ ప‌బ్లిసిటీ చేస్తూ మాట్లాడుతున్నార‌న్నారు. దీంతో అమితాబ్‌పై ఉన్న గౌర‌వం పోయింద‌న్నారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ మీకు నాపై గౌర‌వం లేక‌పోయినా నేను డాక్ట‌ర్ల‌ను గౌర‌విస్తాన‌ని చెప్పారు. ఇక తాను హాస్పిట‌ల్‌కు ప‌బ్లిసిటీ చేయ‌డం లేద‌ని త‌న‌కు సేవ‌లందించిన డాక్ట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌న్నారు. అంత‌కుముందు అమితాబ్ బ‌చ్చ‌న్ కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింద‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చిన సంద‌ర్బంలో కూడా బిగ్‌బీ సీరియ‌స్ అయ్యారు. బాధ్య‌తాయుతంగా వార్త‌లు రాయాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here