సైరా షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబచ్చన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. అమితాబ్ కెరీర్ లో తెలుగులో చేస్తున్న రెండో సినిమా ఇదే.
అయితే సినిమాలోని పాత్ర చేస్తున్న మొదటి సినిమా సైరా నే కావడం విశేషం. ఇంతకు ముందు అక్కినేని ఫ్యామిలీ మనం లో ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక సైరా కోసం అమితాబ్ ఈ నెల 28 న షూటింగ్ లో పాల్గొంటాడట. మూడు రోజుల పాటు జరిగే షూటింగ్ లో అయన హైదరాబాద్ లోనే ఉంటాడట. అమితాబ్ కు సంబందించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. స్వాతంత్ర నేపథ్యంలో పోరాట యోధుడిగా చిరంజీవి కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలనుకొంటున్నారు సినిమా యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here