ఆమెను కచ్చితంగా ఆదుకుంటాను సల్మాన్ ఖాన్

‘వీర్ ఘటి’ హీరోయిన్ పూజ దడ్వాల్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆసుపత్రిలో ఉంది. ఈ హీరోయిన్ గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన నటించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తనను ఆదుకోవాలని ఇటీవల ఓ వీడియో ద్వారా సల్మాన్ఖాన్ని విన్నవించుకుంది. సామ్యూల్ చూసిన కొందరు బాలీవుడ్ ప్రముఖులు కొంత సహాయం చేసారు…బోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఆమెకు తనవంతు సాయం చేశాడు.
1997లో విడుదలయిన ‘తుమ్ సే ప్యార్ హో గయా’ చిత్రంలో ఆమె రవికిషన్‌తో కలిసి నటించింది. కాగా, ఇటీవల పూణేలో సల్మాన్ చేపట్టిన ‘దబాంగ్’ టూర్ సందర్భంగా అతని వద్ద పూజా పరిస్థితిని మీడియా ప్రస్తావించినప్పుడు, “పూజ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ఆమె ఇలాంటి దుస్థితిలో ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఆమెకు చేయగలిగినంత సాయం చేస్తాం. ఆమె కోలుకుంటుందని ఆశిస్తున్నాను” అని సల్మాన్ చెప్పాడు. తాజాగా సల్మాన్ ఖాన్ ఇలా ప్రకటించడంతో పూజా ఎంతగానో సంతోషిస్తున్నారు ఆసుపత్రికి నేనింక భవిష్యత్ చూడగలను అని ధీమాగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here