మ‌రోసారి హాస్పిట‌ల్‌లో చేరినా అమిత్‌షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌స్తున్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌లె క‌రోనాను జ‌యించిన ఆయ‌న ఆరోగ్యంపై మ‌ళ్లీ వ‌దంతులు వ‌స్తున్నాయి.

అమిత్‌షా కు శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు రావ‌డంతో శ‌నివారం రాత్రి ఆయ‌న్ను మళ్లీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లిన‌ట్లు ఉద‌యం నుంచి స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం రాలేదు. ఈయ‌న ఆగ‌ష్టు 2 క‌రోనా బారిన ప‌డ‌గా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆగ‌ష్టు 18వ తేదీన ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న దాదాపు ప‌దిహేను రోజులు హాస్పిట‌ల్‌లోనే ఉన్నారు. అప్పుడు కూడా అమిత్ షా హాస్పిట‌ల్ నుంచే విధులు నిర్వ‌హించారని తెలిసింది.

కాగా నేడు అమిత్‌షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ఆల‌స్యంగా స్పందించింది. అయితే అప్పటికే ప‌లు సోషల్ మీడియా వెబ్‌సైట్లు, టీవీ చాన‌ళ్ల‌లో ఆయ‌న హాస్పిట‌ల్‌లో చేరిపోయిన‌ట్లు చెప్పారు. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన ఆయ‌న మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌ల కోసం హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన‌ట్లు ఎయిమ్స్ వ‌ర్గాలు దృవీక‌రించాయి. దీనికి తోడు పార్ల‌మెంటు మొద‌ల‌వుతున్న నేప‌థ్యంలో పూర్తి స్థాయి ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here