బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా..?

హీరోలను మాస్ లుక్ లో చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుది అందె వేసిన చేయి. బోయపాటి గత సినిమాలు చూస్తే ఈ  విషయం అర్థమవుతుంది. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ ను ‘సరైనోడు’ చిత్రంలో మాస్ హీరోగా ప్రొజెక్టు చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఓ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఉండనుందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here