ప్ర‌పంచ దేశాల‌న్నీ అలా చేయాల్సిందే..

వాతావ‌ర‌ణం పూర్తిగా దెబ్బ‌తింటోంది. ఇటీవ‌ల ఢిల్లీలో పూర్తిగా వాయు కాలుష్యం ఏర్ప‌డిన సంద‌ర్బాలూ ఉన్నాయి. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఒక్క ఇండియాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా వాత‌వ‌ర‌ణ ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగానే ఉన్నాయి. దీంతో ఐక్య‌రాజ్య‌స‌మితి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

వాతవరణ మార్పులు మనవుడి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టాలని ప్రపంచదేశాలకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పిలుపు నిచ్చారు. వాతవరణంలో కర్బన ఉద్గారాలు విడుదల ఆగిపోయే వరకూ ప్రపంచదేశాలన్నీ వాతావరణ ఎమర్జెన్సీని ప్రకటించాలని తేల్చి చెప్పారు. మనం అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవట్లేదని ఎవరైనా చెప్పగలరా అని ప్ర‌శ్నించారు. వాతావరణంలోకి కర్బన ఉద్గారాల నికర విడుదల సమసిపోయేవరకూ వాతావరణ ఎమర్జెన్సీని ప్రకటించాలని కోరుతున్నా అని చెప్పారు.

వాతావరణ మార్పులను నిరోధించేందుకు ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందం అమల్లోకి వచ్చే ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో ఆంటోనియో ప్రసంగించారు. అయితే..ఈసారి కూడా ప్రపంచదేశాలు గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలను కట్టడి చేసేందుకు తగినంత చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన విధానాలకే కొద్దీ పాటి మార్పులు చేశాయనే కామెంట్లు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here