టీఆర్‌పీల్లో రారాజుగా నిలిచిన అల వైకుంఠ‌పురంలో..

అలవైకుంఠపురంలో సినిమా నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా తన ఖాతాలో టీఆర్‌పీల ప‌రంగా కొత్త రికార్డు సృష్టించింది.

గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమాకు ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్‌ను సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలై 7 నెలలు అయ్యింది, ఓటీటీలో విడుదలై 6 నెలలు అవుతుంది. అయినప్పటికి టీవీలో 29.4 రేటింగ్స్‌ సాధించి మరో సెన్సేషన్ రికార్డును సొంతం చేసుకుంది. సినిమాపై ఇంత ఆధారాభిమానాలు కురుపిస్తున్న అభిమానులకు గీతా ఆర్ట్స్‌తో పాటు హారిక, హాసిని క్రియేషన్స్ కృతజ్ణతలు తెలిపాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here