పద్మావత్’ కోసం ‘ప్యాడ్ మాన్’ విడుదలను వాయిదా వేసిన అక్ష‌య్ కుమార్‌

ఎన్నో వివాదాల అనంత‌రం విడుద‌ల కాబోతున్న ‘ప‌ద్మావ‌త్’ సినిమా కోసం అక్ష‌య్ కుమార్ త‌న చిత్రం ‘ప్యాడ్ మ్యాన్’ విడుద‌ల‌ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ కోరిక మేర‌కు ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. నిజానికి ఈ రెండు సినిమాలు జ‌న‌వ‌రి 25న విడుద‌ల కావాల్సి ఉంది.
ఇప్పుడు అక్ష‌య్ కుమార్ నిర్ణ‌యంతో ‘ప్యాడ్ మ్యాన్’ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌కానుంది.అక్ష‌య్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ‘ప‌ద్మావ‌త్’ చిత్ర బృందం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ మేర‌కు న‌టి దీపికా ప‌దుకునే, న‌టులు ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌లు అక్ష‌య్ కుమార్‌కి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఈ రెండు సినిమాల మీద భారీ అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో ఒకేరోజు విడుద‌లైతే నిర్మాత‌ల‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉన్న కార‌ణంగా అక్ష‌య్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here