మహేశ్ కథ కూడా హాలీవుడ్ మూవీ ఆధారమేనా?

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’కి అభిమానుల నుంచే ఆదరణ కరువైంది. ఓ ఫ్రెంచ్ సినిమాను కాపీ చేశారనే విషయం కూడా ఆ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసింది. తాజాగా అలాంటి రూమరే మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా విషయంలో వినిపిస్తోంది.కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా కోసం మరో రచయిత నుంచి కొరటాల కథ తీసుకున్నారు. అయితే ఆ రచయిత 90లలో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీని ఆధారంగా చేసుకుని కథను అల్లుకున్నాడట. మరి ఆ సినిమా స్క్రీన్ ప్లేను అలాగే ఉంచారా .. తనదైన శైలిలోకి కొరటాల మార్చారా? అనే విషయం తెలియాల్సి వుంది. స్క్రీన్ ప్లే పూర్తిగా మార్చి .. కథను కొత్తగా ఆవిష్కరించకపోతే కష్టమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here