అన్నను మించిన తమ్ముడు అఖిల్

అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమా విదేశీ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తుంది. అఖిల్  నటించిన మొదటి చిత్రం అఖిల్ ప్రేక్షకులను అంత మేపించలేకపోయింది భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది…దీంతో నాగార్జున తానే నిర్మాతగా వ్యవహరించి హలో  సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది.

ప్రస్తుతం హలో చిత్రం అమెరికాలో భారీ లాభాలు తెచ్చిపెడుతుంది  ఇప్పటిదాకా హలో సినిమా 8.5 లక్షల డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో తన అన్నయ్య నాగచైతన్యను అఖిల్ దాటేశాడు.అప్పట్లో నాగచైతన్య నటించిన ప్రేమం చిత్రం రికార్డులను అఖిల్ హలో దాటేసింది. మొత్తంమీద అక్కినేని ఫ్యామిలీకి అమెరికాలో భారీ లాభాలు తెచ్చి న సినిమా అక్కినేని కుటుంబం నటించిన “మనం” ఆ చిత్రం 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం.

‘హలో’ ఫుల్ రన్లో మిలియన్ మార్కును దాటడానికి అవకాశముంది. రెండో వీకెండ్లోనూ ఈ సినిమా అక్కడ ఓ మోస్తరుగా వసూళ్లు సాధిస్తోంది. అయితే ఆ అఖిల్  హలో చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంత మెపించలేకపోయింది ఫస్ట్ వీకెండ్ వచ్చిన లాభాలు తరువాత రాలేకపోయినాయి సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా బి-సి సెంటర్లకు అంతగా రుచించని సినిమా కాకపోవడం దీనికి ప్రతికూలంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here