మెగా ఫామిలీ వల్లనే ఇలా పైకొచ్చా – ఆది పినిశెట్టి :

చిరంజీవి కుటుంబం తో మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి రవిరాజా పినిశెట్టి. ఆయన తనయుడు ఆది పినిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ యాక్టర్ అవుతునాడు. తమిళం లో స్టార్ స్టేటస్ కోసం చూసి అది దక్కక పోవడం తో తెలుగు లో విలన్ గా తన రేంజ్ చూపిస్తునాడు. సరైనోడు చిత్రం తో సూపర్ విలన్ గా ఆది కి పేరొచ్చింది. ఆ చిత్రం తరవాత తెలుగు లో సూపర్ వేషాలు లభిస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం మెగా ఫ్యామిలీ చిత్రాలే కావడం గమనార్హం. చరణ్‌, సుకుమార్‌ల చిత్రంతో పాటు పవన్‌, త్రివిక్రమ్‌ చిత్రంలోను ఆది కీలక పాత్ర పోషిస్తున్నాడు.

నాని సినిమా నిన్ను కోరి లో కూడా ఆది కనిపించ బోతున్నాడు. విలన్ ఒక్కటే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ లూ, హీరో కి ఫ్రెండ్ గా కీలక క్యారెక్టర్ లూ చేస్తున్న ఆది తెలుగులోనే సెటిల్ అయిపోయేలా ఉన్నాడు. మెగా ఫామిలీ తో అతనికి ఉన్న పాజిటివ్ సంబంధాల వల్లనే ఇదంతా సాధ్యం అంటున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here