జ్యోత్యిష్యానికి.. సైన్స్‌ కు మధ్య జరిగే కథే రాధేశ్యామ్‌..!

ప్రభాస్‌ హీరోగా జిల్‌ ఫేమ్‌ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్‌ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై యావత్‌ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్‌. ఇక ఇప్పటి వరకు వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే ఇది కచ్చితంగా ఒక అద్భుత ప్రేమ కావ్యమనే భావన అందరిలోనూ కలుగుతుంది. అయితే ఇది కేవలం ప్రేమ కావ్యమే కాకుండా ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన కథనం ఉందని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాలో నటిస్తోన్న సచిన్‌ కేడ్కర్‌ రాధేశ్యామ్‌కు కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పాయింట్‌ను చెప్పాడు. రాధేశ్యామ్‌ చిత్రం జ్యోతిష్యానికి, సైన్స్‌ కు మధ్య కొనసాగే బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌‌ లవ్‌ స్టోరీ అంటా.. అదే విధంగా ఇందులో ప్రభాస్‌ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలున్న వ్యక్తిగా కనిపించనున్నాడని.. ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని సచిన్‌ చెప్పుకొచ్చాడు. ఇక తన పాత్ర గురించి చెబుతూ.. ‘ఈ చిత్రంలో నేను ఒక డాక్టర్‌గా కనిపించనున్నాను’ అని వివరించాడు. ఇలా ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రాని ఒక వైవిధ్యమైన కథాంశంతో రానున్న డార్లింగ్‌ మరోసారి ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here