నిషేధించిన వస్తువు అమెజాన్ లో ఎలా దొరుకుతుంది..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ అనే అంశం చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురు హీరోయిన్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మొదలైన చర్చ.. బాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ వినియోగం అనే అంశం వైపు మళ్లింది. ఇక డ్రగ్స్ తీసుకుంటున్న హీరోయిన్లలో పలువురు బడా నటీమణుల పేర్లు కూడా బయటకు రావడంతో.. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిలో కొందరు

సీబీడీ ఆయిల్ ‌(కానబిడియోల్‌ ఆయిల్‌) వినియోగించినట్లు తెలుస్తోంది. నిజానికి దీన్ని భారతదేశంలో నిషేధించారు. అయితే సీబీడీ అమెజాన్ లో లభిస్తుండడంపై ‘బంగారం’ సినిమా హీరోయిన్ మీరా చోప్రా స్పందించింది. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో నిషేధించినప్పుడు అది ఆన్‌లైన్‌లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్‌ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. మీరా చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here