అమాయ‌కంగా న‌టిస్తున్నారు..

చంద్ర‌బాబు నాయుడు అవినీతి ముద్ర‌లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అడుగ‌డుగునా క‌నిపిస్తాయ‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి సి. రామ‌చంద్ర‌య్య అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో ఎందుకు తిర‌స్క‌రించారో తెలియ‌న‌ట్లు అమాయ‌కంగా న‌టించ‌డం విచిత్రంగా ఉంద‌న్నారు.

2014..19 మ‌ధ్య కాగితాల్లో చూపించిన అభివృద్ధిని ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు చూపిస్తూ సొంత మీడియాలో బాకా కొట్టుకోవ‌డం సిగ్గు చేట‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా న‌మ్మించార‌ని.. ఐదేళ్ల‌పాటు ప్ర‌త్యేక వ విమానాల్లో విదేశాల‌కు పెట్టుబ‌డుల కోసం వెళ్లినా శూన్య‌మే మిగిలింద‌న్నారు.

రాష్ట్ర రాజ‌కీయాల్లో టిడిపి ముగిసిన అధ్యాయం కాబోతోంద‌న్న ఆందోళ‌న‌తో చంద్రబాబు త‌న అస్తిత్వాన్ని చాటుకునేందుకు తంటాలు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇక చంద్ర‌బాబుకు బ్ర‌మ‌ల్లో బ్ర‌త‌క‌డం ఎక్కువైంద‌న్నారు. భాగ‌స్వామ్య స‌ద‌స్సులు పెట్టి రూ. 25 ల‌క్ష‌ల కోట్లు వ‌స్తాయ‌ని చెప్పినా.. అందులో 2శాతం కూడా సాధించ‌లేక‌పోయార‌న్నారు. రాష్ట్రానికి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here