ఎట్టకేలకు కరోనా నుండి అభిషేక్ బ‌చ్చ‌న్ కు ఊరట!!

బాలీవుడ్‌ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ క‌రోనా నుండి కోలుకున్నారు. నేడు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, ఆరాధ్య‌లు క‌రోనాతో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే వీరిలో అభిషేక్ త‌ప్ప అంద‌రూ ఇదివ‌ర‌కే డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు అభిషేక్‌కు నెగిటివ్ రావ‌డంతో ఆయ‌న కూడా డిశ్చార్జ్ అవుతున్న‌ట్లు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. తాను క‌రోనాను జ‌యిస్తాన‌ని చెప్పిన‌ట్లుగానే జ‌రిగింద‌న్నారు.

మా కోసం ప్రార్థించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఆయ‌న అన్నారు. వీరితో పాటు నానావ‌తి హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here