త‌మ‌న్నా, అబ్దుల్ రజాక్ ల పెళ్లి చేసిన సోష‌ల్ మీడియా

త‌మ‌న్నా, పాక్ క్రికెట‌ర్ పెళ్లి చేసుకుంటున్నార‌నే వార్త‌లు కొద్ది రోజుల నుంచి తెగ చ‌క్కెర్లు కొడుతున్నాయి. త‌మ‌న్నాకు ఆ క్రికెట‌ర్ కు సంబంధం ఏంటీ అని ప్ర‌శ్నిస్తే కావాలంటే చూడండి అంటూ వారిద్ద‌రు దిగిన ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. అస‌లు విషయానికొస్తే త‌మ‌న్నాకు త్వ‌ర‌లో పెళ్లి జ‌ర‌గుబోతుంద‌ని వార్తలు ఫిల్మింన‌గ‌ర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
పాక్ క్రికెట‌ర్ అబ్దుల్ రజాక్ త‌మ‌న్నా పెళ్లి చేసుకుంటున్నార‌ని అందుకోసం న‌గ‌లు కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఈ రూమ‌ర్ పై త‌మ‌న్నా స్పందించాల్సి ఉండగా..2013లో దుబాయ్ లో ఓ గోల్డ్ షోరూంను త‌మ‌న్నా, అబ్దుల్ ర‌జాక్ లు ప్రారంభించార‌ట‌. ఆ సంద‌ర్భంలో  వారిద్ద‌రు ఈ ఫోటోల్ని దిగిన‌ట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పిక్ ని వైరల్ గా మార్చి తమన్నా పెళ్లి పీటలెక్కనుందని రూమర్స్ పుట్టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here