ఆచార్య ఫస్ట్ లుక్ సూపర్ బాసూ..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం లో చిరు దేవాదాయ శాఖ లో జరిగే అవినీతి పై పోరాడే ఉద్యోగి గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల తో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మరో అట్రాక్షన్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఆచార్య ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునేలానే కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here