ఎంపీ కారును వెంబ‌డించి అస‌భ్య‌క‌రంగా సైగ‌లు చేసిన ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్..

సామాన్య మ‌హ‌ళ‌ల నుంచి సెలబ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు ఎవ్వ‌రికీ వేదింపులు అతీతం కాదని అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఎంపీ మిమి చ‌క్ర‌వ‌ర్తిని ట్యాక్సీ డ్రైవ‌ర్ అస్య‌భ‌క‌రంగా మాట్లాడుతూ వేధించ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

తృణ‌ముల్ కాంగ్రెస్‌ ఎంపీ మిమి చ‌క్ర‌వ‌ర్తి రాజ‌కీయ నాయ‌కురాలే కాకుండా అంత‌కుముందే హీరోయిన్ కూడా. ఈమెను కూడా ఓ ట్యాక్సీ డ్రైవర్ వేధించారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎంపీ కారులో వెళ్తుండ‌గా వెంబ‌డించి అస‌భ్య‌క‌రంగా సైగ‌లు చేశాడు. ఎంపీ కారు ఎంత దూరం వెళితే అంత దూరం ఆ ట్యాక్సీ డ్రైవ‌ర్ ఆమె కారును ఓవ‌ర్‌టెక్ చేస్తూ వెంబ‌డిస్తూ అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు మాట్లాడుతూనే వ‌చ్చాడు. అయితే చివ‌ర‌కు అత‌ని ఆగ‌డాలకు అడ్డుక‌ట్ట వేయాల‌ని డిసైడ్ అయిన ఆ ఎంపీ అత‌ని కారును వెంబ‌డించి పోలీసులకు ప‌ట్టించింది.

మిమి చ‌క్ర‌వ‌ర్తి ఈ విష‌యంపై మాట్లాడుతూ తాను జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండ‌గా మెట్రోపాలిట‌న్ హైవే స‌మీపంలోని ఆనంద్‌పూర్‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ యాద‌వ్ అనే ట్యాక్సీ డ్రైవ‌ర్ త‌న కారును గ‌రియాహ‌ట్ వ‌ద్ద వెంబ‌డించాడ‌ని తెలిపారు. త‌న‌వైపు అస‌భ్య‌క‌రంగా సైగ‌లు చేశార‌న్నారు. అయితే తాను అవేవీ ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లాన‌ని కానీ అత‌ను మ‌ళ్లీ మ‌రోసారి అదే రీతిలో చేయ‌డంతో అత‌డిని పోలీసుల‌కు ప‌ట్టించానన్నారు. త‌నకు జ‌రిగిన వేధింపులు మ‌రొక‌రికి జ‌ర‌గ‌కూద‌నే ఇలా చేశాన‌ని తెలిపారు. అత‌డిపై గ‌రియాహ‌ట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అత‌నిపై ఐపిసి 354, 354 ఎ, 354 డీ, 509 కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here