కాపాడండి అంటూ రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు వెళ్లిన‌ తొమ్మిదేళ్ల బాలిక‌..

9 సంవ‌త్స‌రాల ఓ బాలిక కాపాడాలి అంటూ భార‌త రాష్ట్రప‌తిని ఆశ్ర‌యించింది. అయితే ఆమె కాపాడాల‌ని కోరుకుంది ఆమెను కాదు.. ప‌ర్యావ‌ర‌ణాన్ని. క‌లుషిత గాలి వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌ని.. ఈ గాలిని పీల్చ‌లేక‌పోతున్నామ‌ని ఆవేద‌న చెందింది.

ఈ బాలిక పేరు లిసిప్రియ. ఈమె బెంగళూరు ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుతోంది. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ల్లో అత్యంత చిన్న వ‌య‌స్సురాలు ఈమెనే. ఢిల్లీలో నెల‌కొన్న కాలుష్యం గురించి ఈమె ఆవేధ‌న చెందుతున్నారు. అందుకోస‌మే రాష్ట్రప‌తి భ‌వ‌న్ ముందు నిర‌స‌న తెలిపింది. గురువారం రాత్రి నుంచి శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు ఈమె ఫ్ల‌కార్డు పట్టుకొన నిర‌స‌న వ్య‌క్తం చేసింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో స్వ‌చ్చ‌మైన గాలి లేద‌ని.. ప్ర‌జ‌లు ఈ గాలిని పీల్చ‌లేక‌పోతున్నార‌ని అంటోంది.

క‌లుషిత గాలిని పీల్చ‌డం ప్రాణాల‌కు ప్రమాదం అని వివ‌రించింది. ప్ర‌తి సంవ‌త్స‌రం క‌లుషిత గాలిని పీల్చుకోవ‌డం వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా 60 ల‌క్ష‌ల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని వివ‌వ‌రాలు తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌జ‌ల‌కు ఉక్కిరిబిక్కిరి చేస్తోంద‌ని అంటోంది. క‌లుషిత గాలి వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న చెందింది. కాగా స్వ‌చ్చ‌మైన గాలి అందించేందుకు ఢిల్లీలో ప్ర‌భుత్వాలు ఆశించినంత చర్య‌లు తీసుకోలేద‌ని తెలిపింది.

కాలుష్య‌మైన ఈ గాలిని పీల్చ‌లేక ఢిల్లీ ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పింది. అనంత‌రం ఈమె ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను కూడా క‌లిశారు. కాగా ఈమె ఇప్ప‌టికే నోబెల్‌ సిటిజన్‌ అవార్డు, డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ చిల్డ్రన్‌ అవార్డు, వరల్డ్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్, ఇండియా పీజ్‌ ప్రైజ్, రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఎర్త్‌ డే నెట్‌వర్క్ అవార్డులు సొంతం చేసుకుంది. మ‌రి ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంతా కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here