అల్లు అర్జున్ సినిమాలో 9 మంది విల‌న్లు.. నిజ‌మెంత‌..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వ‌స్తుందంటే చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు. అలాంటిది ఆ సినిమాలో విల‌న్ల విష‌యం కూడా డైరెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తున్న కొత్త చిత్రం పుష్ప‌.. టైటిల్‌తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు బ‌న్నీ.

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న తాజా చిత్రం పుష్ప. స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ‌డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. రష్మిక హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలె చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ల గురించి తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. `పుష్ప`లో ఏకంగా తొమ్మిది మంది విలన్లు ఉంటారట. మెయిన్ విలన్‌తోపాటు రావు రమేష్, ముఖేష్ రుషి వంటి మరికొందరు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారట. అంతేకాదు `కలర్ ఫొటో`లో విలన్‌గా కనిపించిన కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. మరి, ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here