స‌రిహ‌ద్దులో 60వేల మంది చైనా సైనికులు..

భార‌త్ చైనా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ విష‌యాన్ని ముందు నుంచీ భార‌త్ చెబుతూనే ఉంది. అయితే అమెరికా కూడా ఇప్పుడు చైనా భార‌త స‌రిహ‌ద్దులో ఏం చేస్తుందో అన్న దానిపై మాట్లాడింది. చైనా సైనికులు స‌రిహ‌ద్దులో వేల‌ల్లో మొహ‌రించార‌ని తెలిపింది.

స‌రిహ‌ద్దులో చైనాకు సంబంధించిన 60 వేల మంది సైనికులు ఉన్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది. ఈ స‌మ‌యంలో భార‌త్ అమెరికా సంబంధాలు మ‌రింత మెరుగుపడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. చైనా రెచ్చిపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అమెరికా స‌హాయం ఇండియాకు అవ‌స‌రం అని ఆయన అన్నారు. ల‌ద్దాఖ్‌లో చైనా ఏం చేస్తుందో ప్ర‌పంచం మొత్తం గ‌మ‌నిస్తూనే ఉంద‌ని అమెరికా వ్యాఖ్యానించింది.

దాదాపు 5 నెల‌ల నుంచి ల‌ద్దాఖ్‌లో చైనా భార‌త్ మ‌ధ్య పరిస్థితులు ఇలానే ఉన్నాయి. చైనా ఆక్ర‌మ‌ణ‌లు చేస్తూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఇరు దేశాలకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగినా చైనా మాత్రం త‌న వ‌క్ర‌బుద్దిని చాటుకుంటూనే ఉంది. సైన్యాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని చ‌ర్చ‌ల్లో భాగంగా నిర్ణ‌యించినా.. చైనా మాత్రం సైన్యాన్ని స‌రిహ‌ద్దుకు త‌ర‌లిస్తూనే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో చైనా వ్య‌వ‌హార శైలిపై అమెరికా మాట్లాడ‌టం శుభ ప‌రిణామం అని మేధావులు అంటున్నారు.

అంటే చైనాకు అమెరికాకు స‌రిపోనిప‌క్షంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తోందా అన్న‌ది ప‌క్క‌న పెట్టి…అగ్ర‌దేశం అమెరికా ఇండియాకు మంచి స‌ల‌హాలు ఇవ్వ‌డాన్ని గ్రహించాల‌న్నారు. కాగా ఈ నెల‌లో భార‌త్ అమెరికా మ‌ద్య ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ‌లు ఇండియాలో జ‌రుగ‌నున్నాయి. ఈ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here