నభాలో ఈ యాంగిల్ కూడా ఉందా..!

కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. అనంతరం ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ‘ఈస్మార్ట్ శంకర్’ తో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు, గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే తన ప్రతిభ కేవలం నటనకే పరిమితం కాదని.. తనలో మంచి పెయింటర్ కూడా ఉందంటూ, తన టాలెంట్‌ను అభిమానులతో పంచుకుంది. తాజాగా కామిక్ క్యారెక్టర్ బ్యాట్ మాన్ బొమ్మను గీసిన నభానటేష్ ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసింది. తనకెంతో ఇష్టమైన బ్యాట్ మాన్ బొమ్మను గీయడానికి ఎంత కష్టపడింది.. ఎలా గీసింది.. లాంటి వివరాలను ఈ పోస్టులో తెలిపిందీ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CGHOSRXnRNA/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here