60 మంది పోలీసులు.. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌థ్ర‌స్ ఘ‌ట‌న రోజురోజుకూ తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. యువ‌తి అత్యాచారం, హ‌త్య చేశారంటూ బాదితురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్న త‌రుణంలో నిందితుల‌ను ర‌క్షించేందుకు కూడా పెద్ద ఎత్తున స‌పోర్టింగ్ వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో బాదితురాలి ఇంటి వ‌ద్ద భారీగా పోలీసులు మొహ‌రించ‌డంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

యువ‌తి మృతిచెందిన త‌ర్వాత దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాయి. కాగా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సిట్ ద‌ర్యాప్తు చేస్తోంది. కాగా నిందితుల్లో ఒక‌రు బాదితురాలిని త‌ల్లిదండ్రులే హ‌త్య చేసి ఉంటార‌ని లేఖ రాయ‌డం వివాదాస్ప‌దం అవుతోంది. తాము నిర్దోషుల‌మ‌ని త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. ఈ కేసులో బాదితురాలికి న్యాయం జ‌ర‌గాల‌ని నిందితులు చెబుతున్నారు. దీంతో కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో అన్న‌ది అర్థం కావ‌డం లేదు.

ఇదంతా ఇలా ఉంటే నేడు బాదితురాలి కుటుంబ సభ్యుల‌కు బారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అక్క‌డ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేయ‌డంతో పాటు 60 మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త పెట్టారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. షిఫ్టుల వారీగా పోలీసులు ఇక్క‌డ విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. దీంతో ఈ కేసులో ఏం జ‌రుగుతుందో అర్థం కావ‌డం లేదు. బాదితురాలి కుటుంబ‌స‌భ్యులు మాత్రం త‌మ‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అంటున్నారు. కాగా గ్రామంలో వారికి ఎవ్వ‌రి స‌పోర్టు దక్క‌డం లేద‌ని అంటున్నారు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. కాగా వారిని ఎవ‌రు క‌లుస్తున్నార‌న్న దానిపై పోలీసులు ఓ రిజిస్ట‌రు కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here