2019 ఎన్నికల్లో జగన్ వెంటే మేము కూడా స్పెషల్ స్టేటస్ కమిటీ మెంబెర్స్

ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలను అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ న్న జగన్ కి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. గత ఎన్నికలలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రంతో చేతులు కలిపి తుంగలోకి తొక్కారు. దీంతో పార్లమెంటు సాక్షిగా రావాల్సిన ప్రత్యేక హోదా ఆమె కోసం రాష్ట్రంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా సాధించటానికి పోరాటానికి ఉద్యమబాట పట్టారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో భాగంగా గుంటూరు టౌన్‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ స‌భ్యులు క‌లిశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఇప్ప‌టికీ స‌జీవంగా ఉందంటే అందుకు కార‌ణం మీరేనంటూ వైఎస్ జ‌గ‌న్‌పై క‌మిటీ స‌భ్యులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అలాగే, ఏపీలోని అన్ని రాజ‌కీయ పార్టీలు, సంఘాల‌ను క‌లుపుకుని ప్ర‌త్యేక హోదా పోరాటానికి సార‌ధ్యం వ‌హించాలంటూ వైఎస్ జ‌గ‌న్‌ను వారు కోరారు.

తాము త్వ‌ర‌లో ఢిల్లీకి వెళుతున్నామ‌ని, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా నిరాహార‌దీక్ష‌కు పూనుకున్న వైసీపీ ఎంపీల‌కు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని చెప్పారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో ప్రత్యేక హోదాను వైసిపి మ్యానిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చాలని కోరారు. మరియు జగన్ ని ఆరోగ్యం జాగ్రత్త అంటూ…రాష్ట్రం కోసం మీరు చేస్తున్న కష్టాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అని అన్నారు ప్రత్యేక హోదా సాధన కమిటీ సభ్యులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here