ఒక్క రోజులో 2 లక్ష‌ల క‌రోనా కేసులు..

అమెరికాలో క‌రోనా విజంభ‌ణ కొన‌సాగుతోంది. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ అధ్య‌క్ష్య ఎన్నిక‌ల హ‌డావిడిలో ఉన్న అమెరికాలో ఇప్పుడు క‌రోనా ఉగ్ర‌రూపం క‌న‌బ‌డుతోంది.

ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసులలోనూ అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మరోమారు పాత రికార్డులను అధిగమిస్తూ, కొత్తగా అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. యూఎస్‌లో గడచిన 24 గంటల్లో రెండు లక్షలకు మించిన కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా కేసుల గణాంక వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 2,01,961 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒక్క రోజులో నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యధికం.

ఇటీవ‌ల ట్రంప్ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీల వ‌ల్ల వేలాది మంది క‌రోనా బారిన ప‌డ్డార‌న్న విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావించారు. ఈనేప‌థ్యంలో అధ్య‌క్ష్య ఎన్నిక‌ల్లో ల‌క్ష‌ల మందికి కరోనా సోకి ఉండొచ్చ‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇదే సమయంలో కరోనాతో ఒక్క రోజులో 1,535 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ యూఎస్‌లో 1,02,38,243 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకూ 2,39,588 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. ఎన్నిక‌ల‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల ఆరోగ్యాల గురించి ఆలోచించాల‌ని అంద‌రూ కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here