విమానంలో 160 మంది ప్ర‌యాణీకులు.. నో ల్యాండింగ్‌..

కొద్ది సేపు వెయిట్ చేస్తే ల్యాండ్ అవుతామ‌నుకున్న విమానం గాల్లోనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. విమానం ల్యాండ్ అయ్యేందుకు ప‌ర్మిష‌న్ లేక‌పోవ‌డంతో ఎక్క‌డ బ‌య‌లు దేరిందో తిరిగి అక్క‌డికే వెళ్లిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ప్ర‌యాణీకుల‌కు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. దీనిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది.

గోఎయిర్ విమాన ప్రయాణికులకు విచిత్ర అనుభవం ఎదురైంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు బయలు దేరిన విమానానికి గమ్యస్థానంలో దిగేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో 160 ప్రయాణికులు ఉన్న ఆ విమానం సగం దారిలో ఉండగానే వెనుదిరగాల్సి వచ్చింది. పొర్ట్ బ్లెయర్‌కు వెళ్లాల్సిన విమానం..చివరకు ప్రారంభస్థానమైన చెన్నైకే చేరుకుంది. ఈ విమానానికి సరుకు రవాణా చేసేందుకు మాత్రమే అనుమతి ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై విమానాయరంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ ఫ్లైట్ కేవలం సరుకు రావాణాకు మాత్రమే పరిమితమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కాగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ గోఎయిర్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించామని తెలిపారు. మ‌రికాసేప‌ట్లో దిగుతామ‌ని అనుకున్న వారంతా జ‌రిగిన ఘ‌ట‌న‌తో షాక్‌కు గురైన‌ట్లు తెలిసింది. అయితే ఇలాంటివి మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని ప‌లువురు ప‌బ్లిక్ కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here