బాబాయ్ రాజకీయ గుట్టు అబ్బాయికి తెలుసట?

కింజరాపు కుటుంబంలో బాబాయ్ అబ్బాయి రాజకీయ వారసులు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాతికేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, అయిదేళ్ళు మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు పేరు మీదనే రాజకీయం చేస్తున్నారు.

ఎన్టీయార్ తోనే  రాజకీయాల్లోకి వచ్చిన ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు కానీ తన చిరకాల కోరికగా రాష్ట్ర మంత్రి కాలేకపోయారు. సరే అన్న వారసుడిగా తమ్ముడు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి అయ్యారు. అయిదేళ్ళ పాటు మంత్రిగా ఉన్న టైంలోనే ఈ ఎస్ ఐ స్కాంలో ఇరుక్కున్నారు. 35 లక్షల కార్మికుల సొమ్ము 151 కోట్ల రూపాయలను అచ్చెన్నాయుడు అవినీతి చేసారని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే తమ్ముళ్ళు ఆయనకు మద్దతు ఇవ్వడమేంటని వైసీపీ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు అంటున్నారు.

ఇక తన బాబాయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని గోల పెడుతున్న అబ్బాయి రామ్మోహననాయుడుకు అచ్చెన్న గుట్టు మొత్తం తెలుసని అప్పలరాజు అంటున్నారు. లేకపోతే అవినీతి ఎవరు చేసినా వ్యతిరేకించాల్సిన బాధ్యతాయుతమైన ఎంపీ గారు ఇలా అన్యాయం, దారుణమంటూ రచ్చకెక్కడమేంటని వైసీపీ ఎమ్మెల్యే నిగ్గదీస్తున్నారు.

కక్ష కడితే శిక్షలు పడవని, అవినీతి చేస్తే, ఆధారాలు ఉంటేనే అరెస్టులు అవుతాయని అప్పలరాజు అంటున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను జనాలకు చెప్పకుండా మభ్యపెట్టాలని టీడీపీ నేతలు చూస్తే వారే ఆత్మవంచన చేసుకున్నవారు అవుతారని సీదరి హితబోధ చేశారు. మరి అబ్బాయి గారికి ఇప్పటికైనా  అర్ధమవుతుందా అంటున్నారు వైసీపీ నేతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here