దేశంలో ఆ రాష్ట్రానికే ఎక్కువ‌గా క‌రోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు తెలుసా..

ఇండియాలో క‌రోనా వ్యాక్సిన్ కోసం ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రో నెల రోజుల్లో క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తారన్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదేశాలు కూడా అందాయి. క‌రోనా వ్యాక్సిన్‌ను ఏ విధంగా పంపిణీ చేయాల‌న్న దానిపై కేంద్రం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వాలకు వివ‌రాలు వెళ్లాయి.

అయితే ఏ రాష్ట్రానికి ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఇస్తార‌న్న దానిపై తీవ్రంగా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ఏ రాష్ట్రాల్లో అయితే 50 ఏళ్ల వయసుపైబడినవారు అధికంగా ఉంటారో, అలాగే మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతుంటారో వారికి ముందుగా కరోనా వ్యాక్సిన్ అందే అవకాశాలున్నాయి. అలాగే ఆయా రాష్ట్రాలకు ఎక్కువ డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీకానుంది. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల కన్నా తమిళనాడు జనాభా తక్కువ. అయితే ఇక్కడ వయసు పైబడినవారు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు అధికంగా ఉండటంతో తమిళనాడుకు అధిక డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ అయ్యే అవకాశాలున్నాయి.

బీహార్‌లో జనాభా ఎక్కవగా ఉన్నప్పటికీ, వారిలో యువత శాతమే అధికంగా ఉంది. అలాగే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ లో వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువగా ఉంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు జనాభాలో 50 శాతానికి పైబడివారు అధికంగా ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ అధిక డోసులు పంపిణీ కానున్నాయి. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంద‌న్న‌ది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here