జీవీకే గ్రూప్‌ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదు..?

జీవీకే గ్రూప్‌ చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డిపై సీబీఐ కేసు నమోదైంది. అలాగే ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డితో పాటు 9 మందిపై కూడా సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో ఒప్పందం చేసుకున్నారు.

ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. అలాగే జీవీకే గ్రూప్ లోని ఇతర సంస్ధలకు ఆర్ధిక సాయం చేసే పేరుతో మరో రూ. 395 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఈ కేసులో గుర్తించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here