ఎట్టకేలకు రియాకు బెయిల్‌..

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు చేశారు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీలో అలజడి మొదలైన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ను విచారించగా బాలీవుడ్‌ డ్రగ్స్‌ అంశం బయటకు వచ్చింది. దీంతో రియాతో పాటు అతని సోదరుడు షోవిక్‌ చక్రవర్తిలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

దీన్ని ఛాలెంజ్‌ చేస్తూ..రియా, షోవిక్‌ బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రత్యేక ఎన్డిపిఎస్ న్యాయస్థానం వారి కస్టడీని అక్టోబర్ 20 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో రియా ఆమె సోదరుడు షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాగా బాంబే హైకోర్టు రియా పిటిషన్‌ని పరిశీలించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె సోదరుడి బెయిల్ పిటిషన్ మాత్రం తిరస్కరించింది. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టు అయిన రియాకు దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్ లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here