చంద్రబాబులా రాజ‌కీయం కాదు.. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లే ప్రాధాన్యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఆయ‌న భేటి త‌ర్వాత కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంట్లో ప్ర‌ధానంగా ఎన్ని ఆఫ‌ర్లు ఇచ్చినా జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం అన్నింటిని కాద‌ని ముందుకు వెళుతున్నార‌ని టాక్‌.

మోదీతో స‌మావేశంలో జ‌గ‌న్ ఏం మాట్లాడారో అన్న దానిపై సందిగ్ద‌త ఉంది. అయితే జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు మాత్రం ప్ర‌ధానిని సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేశాయ‌ని తెలుస్తోంది. భారీ మెజార్టీ ఉన్న బీజేపీ పిలిస్తే వెంట వెళ్ల‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం అదే చేస్తున్నారు. స్వ‌యంగా ప్ర‌ధాని కోరినా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంలో అంటే ఎన్డీయేలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదంట‌. ఇందుకు కార‌ణం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే. జ‌గన్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్పటి నుంచి ముందు ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తున్నారు. ఆ త‌ర్వాత‌నే రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న తీసుకొస్తున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్ర‌ధానంగా కావాల్సింది కోరుతోంది ప్ర‌త్యేక హోదా. ఈ అంశానికే వై.ఎస్ జ‌గ‌న్ క‌ట్టుబ‌డి ఉన్నారు. అందుకే ఇప్ప‌టికీ ఏపికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాల‌ని బీజేపీ వైసీపిని కోరిందన్న వార్త‌లు ఎక్కువ అయ్యాయి. అయితే ఈ వార్త‌ల‌పై క్లారిటీ లేక‌పోయినా.. జ‌గ‌న్ మాత్రం క్లారిటీగా ఉన్నారంట‌. ఎందుకంటే కేంద్రం నుంచి మంచి ఆఫ‌ర్ వ‌చ్చినా రాష్ట్రంలో మ‌నం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని చెబుతున్నారు. మూడు కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని కేంద్రం చెబుతున్నా జ‌గ‌న్ మాత్రం ప‌ద‌వులు వ‌ద్దు ప్ర‌జ‌లు ముద్దు అన్న‌ట్లు ముందుకు వెళుతున్నారు. ఇది తెలిసిన సొంత పార్టీ నేత‌లే ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారంట‌.

గ‌తంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం నుంచి వ‌చ్చిన నేత‌లంతా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అవాక్క‌వుతున్నారంట‌. ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు నాయ‌డు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి ప‌ద‌వులు ఆయ‌న ఇప్పించుకున్నారు. ఆ త‌ర్వాత చివ‌ర్లో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ఉన్నందుకు తాను ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఉన్న క్రేజ్ చూసి ఎన్డీయేనే ఆహ్వానిస్తున్నా ఆయ‌న మాత్రం నో చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు నాయుడు ఉండి ఉంటే క‌చ్చితంగా జ‌గ‌న్ లా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాకుండా.. సొంత ప్ర‌యోజ‌నాలు చూసుకొని ఈ పాటికే కేంద్ర మంత్రి వ‌ర్గంలో భాగం అయ్యేవారని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మొత్తానికి ఎన్డీయే జ‌గ‌న్‌ను ర‌మ్మ‌ని ఎంత పిలుస్తున్నా ఆయ‌న మాత్రం దేశం కోసం తీసుకుంటున్న మంచి నిర్ణ‌యాల‌కు బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తాను త‌ప్ప కేంద్రంలో భాగ‌స్వామ్యం కాలేమ‌ని తేల్చి చెబుతున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు మాట్లాడేందుకు కూడా అవ‌కాశం లేదు. దీంతో ఈ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి ప‌నికిరాని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసేందుకు ముందుకు వ‌స్తుంటార‌ని తెలుస్తోంది. ఏదిఏమైనా 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జా మ‌ద్ద‌తుతో భారీ విజ‌యం సాధించిన జ‌గ‌న్ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని రాజ‌కీయాల్లో టాక్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here