సీఎం జ‌గ‌న్ పై బీజేపీ ఎందుకు కోపంగా ఉందో తెలుసా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై బీజేపీ కోపంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ అవ‌లంబిస్తున్న విధానాలే ఇందుకు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. తాజాగా బీజేపీ నేత‌లు చేస్తున్న కామెంట్ల‌ను బ‌ట్టి ఇది క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది.

బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువర్ధ‌న్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. వరదల నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్ర మంత్రులెవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లో దాఖలాలు లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి మేల్కొన్నారని ఎద్దేవా చేశారు. వాతావ‌ర‌ణ శాఖ ముందుగా స‌మాచారం ఇచ్చినా చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని అన్నారు.

ఇక జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై అల‌ర్ట్‌గానే క‌నిపించింది. మంత్రులు వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌లేద‌ని ప్ర‌తిప‌క్షాల వాద‌న ఉన్న‌ప్ప‌టికీ సీఎం మాత్రం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించారు. గోదావ‌రి జిల్లాల‌తో పాటు ఇత‌ర వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల అధికారులు అల‌ర్టుగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు ఆదుకోవ‌డంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల‌పై న‌ష్టాన్ని తీర్చేందుకు ఆదుకోవాల‌ని కేంద్రానికి కూడా లేఖ రాశారు. మ‌రి ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఈ విధంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తుంటార‌న్న‌ది అంద‌రూ తెలుసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here