శానిటైజ‌ర్లు వాడ‌టం వ‌ల్ల కోట్లాది మంది ప్ర‌మాదంలో..

ప్ర‌పంచంలో శానిటైజ‌ర్ల వాడ‌కం ఎక్కువైంది. క‌రోనా వైర‌స్ భూమి మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత శానిటైజ‌ర్ అంటే తెలియ‌ని వారు కూడా ఇప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. అంత‌లా మ‌న జీవితంలో శానిటైజ‌ర్ భాగ‌మైపోయింది. ఇప్పుడు ఇదే పెను స‌మ‌స్య‌గా మారింది.

కేవ‌లం ఈ ఐదు నెల‌ల కాలంలోనే శానిటైజ‌ర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే శానిటైజ‌ర్లు అతిగా వాడితే పెను ప్రమాదంలో ప‌డ‌తామ‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. రానున్న కాలంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని అంచ‌నాలు వేస్తున్నారు. యాంటీ మైక్రోబియ‌ల్ నిరోధ‌క‌త సామ‌ర్థ్యం పెరిగి.. వ్యాధికార‌క సూక్ష్మ‌జీవుల‌పై ఔష‌దాల ప్ర‌భావం త‌గ్గిపోతుంద‌ని ఎయిమ్స్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే శానిటైజ‌ర్ల‌ను ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్ల క్రిముల‌పై మంద‌ల ప్ర‌భావం ప‌నిచేయ‌ద‌న్న‌ట్లు తెలుస్తోంది.

ఔష‌ద వినియోగాన్ని అదుపుచేయాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. లేదంటే 2050 సంవ‌త్స‌రం నాటికి ప్ర‌తి సంవ‌త్స‌రం కోటి మంది ప్ర‌మాదంలో ప‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. శానిటైజ‌ర్ల వ‌ల్ల భ‌విష్య‌త్తులో ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా ఉంటాయ‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సూచిస్తున్నారు. కాగా నేడు ఎక్క‌డ‌కు వెళ్లినా మొద‌ట హ్యాండ్ష్ శానిటైజ‌ర్ చేసుకోవాల‌ని చెబుతున్నారు. ఏ వ‌స్తువును తాకినా కూడా వెంట‌నే ఇదే ప‌ని చేస్తున్నాం. అయితే వైద్యులేమో ప్ర‌స్తుతం ఇలాంటి విష‌యాలు చెబుతున్నారు. మ‌రి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here