కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం.

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాలలో ఇటీవల జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేష్‌, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌‌లు మీడియా, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టు ఇట‌వ‌ల‌ విచారణ జ‌రిగింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. వైసీపీ నేతల వ్యాఖ్యలు కోర్టులపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని, జడ్జిలు, కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు లేవని న్యాయస్థానం ప్రశ్నించింది. వాళ్ల‌ని ర‌క్షించ‌డానికి కేసులు న‌మోదు చేయ‌లేద‌ని భావించాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. వైసీపీ నేతల వ్యాఖ్యలు కోర్టులపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. జడ్జిలు, కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు లేవని న్యాయస్థానం ప్రశ్నించింది. రిజిస్ట్రార్‌ కేసు దాఖలు చేసినా పదవిలో ఉన్నవాళ్లపై కేసులు ఎందుకు పెట్టలేదంది. సీఐడి విఫల‌మైతే సీఐడి విచార‌ణ‌కు బ‌దిలీ చేయాల్సి ఉంటుంద‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here