వెండితెరపై ఆ అందాల తార బయోపిక్‌..! లీడ్‌ రోల్‌లో సాయి పల్లవి.?

తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దివంగత నటి సౌందర్య. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూనే ఎంతో మంది అభమానులను సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో నటించిన సౌందర్య ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక సినిమా రంగంలో అద్భుతంగా రానిస్తున్న సమయంలోనే సౌందర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ తరుణంలో ఓ ప్రచార కార్యక్రమానికి హాజరుకావడానికి వెళుతోన్న సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఈ అందాల తార మరణించిన విషయం తెలిసిందే.

సౌందర్య మరణించిన దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆమె బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సౌందర్య సినీ ప్రయాణాన్ని, కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆమె సంపాదించుకున్న స్థానాన్ని ఇతివృత్తంగా ఈ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ తెరకెక్కించనుందట. ఇక సౌందర్యగా సాయిపల్లవి నటించనుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నారని టాక్‌. ఈ సినిమాలో నటించడానికి సాయిపల్లవి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here