వేదాంతాలు చెప్తోన్న అందాల భామ…

తెలిసో తెలియకో జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవిత లక్ష్యం అంటుంటారు. తాజాగా ఇదే విషయాన్ని కాస్త వేదాంతాన్ని జోడించి చెబుతోంది బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవీనా  మాట్లాడుతూ… ‘తప్పులు చేయడం మానవ సహజం. నేను కొన్ని పొరపాట్లు చేశాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆ తప్పులు నాకు గొప్ప పాఠాలను  నేర్పాయి. ఎన్నో ఆశలతో చిన్న వయసులోనే  నట జీవితాన్ని ఆరంభించాను. నేను కన్న కలల్లో  చాలా వరకు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. అవి నెరవేరలేదనే అపరాధభావం నాలో లేదు. వాటిని తలుచుకొని ఎప్పుడూ కుమిలిపోలేదు. కష్టాలు ఎదురైన ప్రతిసారి జీవితాన్ని మరింత గాఢంగా ప్రేమించడం నేర్చుకున్నా. ఓడిపోయిన చోట గౌరవాన్ని పొందడం కోసం అంకితభావంతో కష్టపడ్డా’ అని వేదాంతం చెప్పుకొచ్చిదీ బ్యూటీ.

ఇక రవీనా కెరీర్ విషయానికి వస్తే..1991లో వచ్చిన  ‘పత్తర్ కే పూల్’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. అనంతరం ‘రథ సారధి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ.  ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’లో కీలక పాత్రలో నటిస్తోంది రవీనాటాండన్‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here